టెక్కలిలో ఉద్రిక్తత

Sep 15 2021 @ 00:12AM
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన స్థానికులు




స్థలం కోసం వివాదం

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన

  టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 14: టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధిలోని ఆది ఆంధ్రా వీధిలో ఓ స్థల వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో గ్రామకంఠం స్థలంలో ఓ వ్యక్తి నిర్మాణం చేపడతుండగా... వీధివాసులు అడ్డుకున్నారు. మంగళవారం అదే స్థలం సమీపంలో చదును చేస్తుండగా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  ఘర్షణకు దారితీయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆది ఆంధ్రావీధి వాసులు ర్యాలీగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని అక్కడే బైఠాయించారు. పోలీసులు సముదాయించినా తాము అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ ఈ ఘటనపై స్పందించారు. గ్రామపెద్దలను, ప్రజాసంఘాల నాయకులను పిలిపించి చర్చించారు. తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలను చూపించారు. సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ కామేశ్వరరావు, తహసీల్దారు బి.నాగభూషణరావు సముదాయించినా వారు వినలేదు. చీకటి పడే వరకూ అక్కడే నిరసన చేపట్టారు. చివరకు సమస్య పరిష్కరిస్తామని సబ్‌ కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.