AP News: కడప కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-25T18:00:50+05:30 IST

టీడీపీ (TDP), యువజన సంఘాల జేఏసీ (JAC) నేతలు చలో కలెక్టరేట్ పిలుపు నేపథ్యంలో...

AP News: కడప కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత

కడప (Kadapa): టీడీపీ (TDP), యువజన సంఘాల జేఏసీ (JAC) నేతలు చలో కలెక్టరేట్ పిలుపు నేపథ్యంలో కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ, యువజన సంఘాల జేఏసీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఒకానొక దశలో కలెక్టరేట్‌ ముట్టడికి టీడీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరగడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2022-08-25T18:00:50+05:30 IST