గజ్వేల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-03-03T00:37:07+05:30 IST

జిల్లాలోని గజ్వేల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

గజ్వేల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత వారం మల్లన్నసాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పరిహారం అందకపోవడంతో గిడుగు డేవాదాసు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది మధ్యవర్తుల వల్లే పరిహారం అందలేదని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాల ఘర్షణతో గజ్వేల్ పోలీస్ స్టేషన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇరువర్గాలను పోలీసులు శాంతింప జేశారు. 

Updated Date - 2022-03-03T00:37:07+05:30 IST