సరిహద్దుల్లో టెన్షన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-05-11T06:56:54+05:30 IST

రాష్ట్ర సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కరోనా రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌లను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇందుకోసం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపు రం, నల్లగొండ జిల్లా దామరచర్ల, నాగార్జున్‌సాగర్‌లలో చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు.

సరిహద్దుల్లో టెన్షన్‌ టెన్షన్‌
చెక్‌పోస్టు వద్ద నిలిచిన అంబులెన్స్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు చోట్ల చెక్‌పోస్ట్‌

షరతులతో రాష్ట్రంలోకి అనుమతి 


రాష్ట్ర సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కరోనా రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌లను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇందుకోసం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపు రం, నల్లగొండ జిల్లా దామరచర్ల, నాగార్జున్‌సాగర్‌లలో చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. 24 గంటల పాటు తనిఖీలు చేస్తూ చికిత్స కోసం హైదరాబాద్‌కు కొవిడ్‌ రోగులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి తరలిస్తున్నారో అక్కడి అస్పత్రిలో బెడ్‌ ఖరారైనట్లు లెటర్‌ ఆధారంతో పాటు నేరుగా ఆస్పత్రి నిర్వాహకులతో పోలీసులు మాట్లాడి నిర్ధారించుకున్నాకే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌ నిర్వాహకులు, బాధిత బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తమను పంపించాల ని పట్టుబడుతుండటంతో కొద్దిసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇలా సోమవారం మూడు చెక్‌పోస్టుల్లో 28 అంబులెన్స్‌లకు గాను 25 వాహనాలను వెనక్కి పంపించారు. మూడు వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించారు. 


కోదాడరూరల్‌, మే 10: ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలంలోని నల్లబండగూడెం పంచాయతీ రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో అంబులెన్స్‌ డ్రైవర్లు, కొవిడ్‌ బాధితుల బంధువులు, పోలీసుల మద్య వాగ్వాదం జరిగిం ది. సోమవారం ఉదయం 10గంటల నుంచి కోదాడ రూరల్‌ సీఐ శివరామిరెడ్డి, అనంతగిరి ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు పోలీసు సిబ్బంది జిల్లా సరిహద్దుల వద్ద మోహరించి, ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకున్నారు. వీరికి హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో అపాయింట్‌మెంట్‌, బెడ్లు ఖరారయ్యా లేదో ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించి అంబులెన్స్‌లను పంపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం ఆరు అంబులెన్స్‌లు రాగా, అందులో మూడు అంబులెన్స్‌లకు అనుమతిని నిరాకరించి వెనక్కు పంపారు. ఏపీలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో అక్కడి రోగులను చికిత్స నిమి త్తం హైదరాబాద్‌ కు తరలిస్తున్నారు. దీంతో స్థానిక ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు దొరకటం కష్టతరంగా మారడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ నుంచి వచ్చే అం బులెన్సులను అధికారులు అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేసి 24 గంటల పాటు నిఘాపెట్టారు. ఇక రాష్ట్రానికి చెందిన వాహనాలను ఏపీ మధ్యాహ్నం 12 గంటలలోపు అనుమతిస్తోంది. ఆతరువాత ఈపాస్‌ యాప్‌ లో నమోదు చేసుకున్న వాహనాలనే అనుమతిస్తున్నారు.


అనుమతి ఉంటేనే ప్రవేశం

దామరచర్ల, నాగార్జునసాగర్‌, మఠంపల్లి: అనుమతి ఉంటేనే ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను మండలంలోని వాడపల్లి సరిహద్దులో ఏపీ అంబులెన్సులను పోలీసులు సోమవారం వెనక్కి పంపారు. సోమవారం తెల్లవారుజాము నుంచి సుమారు 10 అంబులెన్స్‌లను సరిహద్దులోనే వెనక్కి పంపినట్లు పోలీసులు తెలిపారు. నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు వద్ద మొత్తం 12 అంబులెన్స్‌లను పోలీసులు వెనక్కి పంపారు. ఇదిలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే మఠంపల్లి మండలం మట్టపల్లి వారధి వద్ద చెక్‌పోస్టును ఎత్తివేయడంతో వాహనాల రాకపోకలు య థేచ్ఛగా సాగుతుండటం గమనార్హం. రాష్ట్ర సరిహద్దుల్లోని ఇతర చెక్‌పోస్టులకు భిన్నంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. అయితే మట్టపల్లి వంతెన మీదిగా తెలంగాణ నుంచి ఆక్సిజన్‌, కొవిడ్‌ మందులు సరిహద్దు రాష్ట్రాలకు తరలించకుండా తనిఖీలు చేస్తున్నామని తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు తెలిపారు. అయితే నీడకోసం ఇక్కడ నామమత్రంగా చెక్‌పోస్టు టెంటు వేయగా,అంబులెన్సులు, ఇతర వాహనాలను మాత్రం అడ్డుకునే సిబ్బంది కరువయ్యారు.


ఎక్కడా లేని ఆంక్షలు : జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను

అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలుసుకున్న ఏపీ రాష్ట్రం జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభా ను సోమవారం సాయంత్రం రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొని పోలీసులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి నిత్యం విజయవాడ వైపు అంబులెన్సులు వెళ్తున్నా ఏపీ ప్రభుత్వం ఎన్నడూ అడ్డుకోలేదన్నారు. తెలంగాణ ఉన్నతాధికారులతో మాట్లాడి అంబులెన్స్‌లను అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే చెక్‌పోస్టు వద్ద ఉన్న సమయంలోనే విజయవాడ నుంచి రెండు అంబులెన్సులు రాగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో చర్చించి వాటిని హైదరాబాద్‌ పంపారు.


ఈపాస్‌ ఉంటేనే ఏపీలోకి అనుమతి

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

కోదాడ: ఈపాస్‌ ఉంటేనే ఏపీలోకి అనుమతి ఇస్తామని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపీలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఎవరైనా అత్యవసర పనులపై ఏపీకి రావాలంటే ఈపాస్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తగిన ఆధారాలు చూపించి ఈపా్‌సకు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని స్పష్టం చేశారు. పాస్‌ అవసరమైన వారు చి రునామా, ఆధార్‌, ప్రయాణించే వాహనం నంబర్‌, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్‌, ఈ-మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు పరిశీలించాక మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతి పత్రాలు పంపుతారని, ప్రయాణిస్తున్నవారు దీంతోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి తెలిపారు.


పాస్‌ దరఖాస్తు కోసం వాట్సాప్‌ నంబర్లు

ఏపీలోని శ్రీకాకుళం వెళ్లేవారి కోసం వాట్సాప్‌ నంబర్‌ 6309990933, విజయనగరం వెళ్లేవారు 9989207326, విశాఖపట్నం రూరల్‌ 9440904229, విశాఖపట్నం టౌన్‌ 9493336633, తూర్పు గోదావరి 9494933233, రాజమండ్రి అర్బన్‌ 9490760794, పశ్చిమ గోదావరి 8332959175, కృష్ణ 9182990135, విజయవాడ సిటీ 7328909090, గుంటూరు 9440796184, గుంటూరు అర్బన్‌ 8688831568, ప్రకాశం 9121102109, నెల్లూరు 9440796383, చిత్తూరు 9440900005, తిరుపతి అర్బన్‌ 9491074537, అనంతపురం 9989819191, కడప 9121100531, కర్నూల్‌ నంబర్‌ 7777877722కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ వాట్సప్‌ నుంచి మొబైల్‌ నంబర్లకు, మెయిల్‌ ఐడీలకు వచ్చిన అనుమతులను మాత్రమే అంగీకరిస్తామని, ఇతర నంబర్ల నుంచి ఫార్వర్డ్‌ చేసిన అనుమతులు(పా్‌సలు) చెల్లుబాటుకావని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T06:56:54+05:30 IST