టెన్త్‌ వార్షిక పరీక్షలు షురూ

ABN , First Publish Date - 2022-05-24T05:44:39+05:30 IST

టెన్త్‌ వార్షిక పరీక్షలు షురూ

టెన్త్‌ వార్షిక పరీక్షలు షురూ
ఆమనగల్లు: బాలికల ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రం వద్ద..

  • మొదటిరోజు పరీక్ష ప్రశాంతం
  • 8.30గంటలకే కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు 
  • పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు 


ఆమనగల్లు/చేవెళ్ల/షాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌/షాద్‌నగర్‌/శంషాబాద్‌ రూరల్‌/కందుకూరు/యాచారం/కొత్తూర్‌, ఆమనగల్లు, మే 23: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మాస్‌కాపియింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం 8:30గంటలకే విద్యార్థినీవిద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9గంటల నుంచి పరీక్షాకేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించారు. ఉదయం 9:30 నుంచి మద్యాహ్నం 12:45 వరకు పరీక్ష కొనసాగింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్‌టిక్కెట్‌ నెంబర్లను, కేంద్రం కోడ్‌లను అధికారులు పొందుపరిచారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండల కేంద్రాల్లో 9పరీక్షా కేంద్రాల్లో 1875 మంది  విద్యార్థులకు గానూ 1860మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆమనగల్లు జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 270మంది విద్యార్థులకు గానూ 265మంది, బాలుర ఉన్నత పాఠశాలలో 263 మందికి గానూ 262, కడ్తాల మండల కేంద్రంలో 335మందికి గానూ 334, ముద్విన్‌ ఉన్నత పాఠశాలలో 119మంది విద్యార్థులకు గానూ అందరూ, మాడ్గుల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కేంద్రంలో 202 మంది విద్యార్థులకు 201, ప్రాథమిక పాఠశాల కేంద్రంలో 133 మందికి విద్యార్థులకు గాను 132, ఇర్విన్‌ పరీక్ష కేంద్రంలో 142మంది విద్యార్థులకు గానూ 141మంది విద్యార్థులు హాజరయ్యారు. తలకొండపల్లి మండలకేంద్రంలోని పరీక్షా కేంద్రంలో 305మంది విద్యార్థులకు గగానూ 302, వెల్జాల్‌ పరీక్షా కేంద్రంలో 106విద్యార్థులకు గానూ 104మంది విద్యార్థులు మొదటిరోజు పరీక్షకు హాజరయ్యారు. ఆమనగల్లు పరీక్షాకేంద్రాన్ని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రామాంజన్‌రెడ్డి తనిఖీచేశారు. నాలుగు మండలాల పరిధిలోని 9పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 15మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆమనగల్లు పరీక్షాకేంద్రాన్ని తహసీల్దార్‌ పాండూనాయక్‌ సందర్శించి పరీక్షలతీరును పరిశీలించారు. అన్ని పరీక్షాకేంద్రాల వద్ద  ఎస్‌ఐలు ధర్మేశ్‌, హరిశంకర్‌గౌడ్‌, వరప్రసాద్‌, రమేశ్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పదోతరగతి మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. చేవెళ్ల మండలంలో మొత్తం 749మంది విద్యార్థులకు గానూ 736మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 13మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని మండల విద్యాధికారి  అక్బర్‌ తెలిపారు. చేవెళ్లలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలు ఉండగా మోడల్‌ స్కూల్‌లో 184మంది విద్యార్థులకు గానూ 181మంది, ప్రభుత్వ బాలికల పాఠశాలలో 99మంది విద్యార్థులకు గానూ 95 మంది, ప్రభుత్వ బాలుర పాఠశాలలో 100మంది విద్యార్ధులకు గానూ 98మంది, ఆలూర్‌ ప్రభుత్వ పాఠశాలలో 71మందికి అందరూ, సిల్వర్‌ డేల్‌ పాఠశాలలో 120 మంది విద్యార్థులకు గానూ 118మంది, సత్యసాయి పాఠశాలలో 175 మంది విద్యార్థులకు గానూ 173మంది పరీక్షలు రాశారు. శంకర్‌పల్లి మండలంలో మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 1112మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1101 మంది హాజరయ్యారు. ఇందులో 11మంది విద్యార్థులు హాజరుకాలేదని మండల విద్యాధికారి అక్బర్‌ తెలిపారు. అదేవిధంగా షాబాద్‌లోని 8 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు చెందిన 800మంది విద్యార్థులకు  గానూ 795 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు .  మొయినాబాద్‌లో 1198మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇందులో 1190 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. కాగా 8మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని మండల ఇన్‌చార్జి అధికారి వెంకటయ్య తెలిపారు. అదేవిధంగా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 4,351మంది విద్యార్థులకు గానూ 4,303 విద్యార్థులు హాజరయ్యారు. 48మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలో పెద్దసంఖ్యలో విద్యార్థులు మొదటిరోజు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఒక్క ఫరూఖ్‌నగర్‌ మండల కేంద్రంలోనే 29మంది విద్యార్థులకు పరీక్షకు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా శంషాబాద్‌ మండలంలో మొత్తం 9సెంటర్లలో 1726 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 18మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకాలేదని ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో మొత్తం 1639 మంది విద్యార్థులకు గానూ 1628మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 11మంది గైర్హాజరయ్యారు. పరీక్షల జిల్లా అబ్జర్వర్‌ సీ.హెచ్‌.రమణకుమార్‌ పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా కొత్తూర్‌ మండలంలో 549మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తుండగా, మొదటి రోజు ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పెంజర్ల సర్పంచ్‌ మామిడి వసుంధర గ్రామం నుంచి కొత్తూర్‌కు విద్యార్థులను తరలించేందుకు ఉచిత ఆటోను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కృష్ణావేణి పాఠశాలలో పదిపరీక్షలు రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థులకు కౌన్సిలర్‌ మాదారం నర్సింహాగౌడ్‌ ఫ్రూటీ ప్యాకెట్లను అందజేశారు. కందుకూరులో 757మంది విద్యార్థులకు గానూ అధికారులు 5పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కందుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో 111మంది విద్యార్థులకు గానూ 110, బాలుర ఉన్నత పాఠశాలలో 142మందికి గానూ 137మంది పరీక్ష రాశారు. మండల కేంద్రంలోని నోబుల్‌స్కూల్‌లో 170మంది విద్యార్థులకు గానూ 167మంది విద్యార్థులు హాజరయ్యారు. యాచారంలో 973 మంది విద్యార్థులకు గానూ 962 మంద విద్యార్థులు పరీక్ష రాశారు.

Updated Date - 2022-05-24T05:44:39+05:30 IST