Tenth ప్రశ్నపత్రం LEAK CASE: TDP మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ఎస్పీ ప్రెస్‌మీట్

ABN , First Publish Date - 2022-05-10T23:42:54+05:30 IST

Tenth ప్రశ్నపత్రం LEAK CASE: TDP మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ఎస్పీ ప్రెస్‌మీట్

Tenth ప్రశ్నపత్రం LEAK CASE: TDP మాజీ మంత్రి  నారాయణ అరెస్ట్‌పై ఎస్పీ ప్రెస్‌మీట్

చిత్తూరు: టీడీపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో చిత్తూరు ఎస్పీ తెలిపారు. నారాయణతోపాటు తిరుపతి డీన్ కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమాధానాలు రాసి లోపలికి పంపే ప్రయత్నం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. గత నెల 27న వాట్సాప్ లో ప్రశ్న ప్రత్రం వచ్చిందని, టెక్నికల్ ఆధారాలు దొరకడంతో అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు. ముందుగానే మాట్లాడి పెట్టుకొని ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారని ఎస్పీ తెలిపారు. కాసేపట్లో నారాయణను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. మార్కుల కోసం మాల్ ప్రాక్టీస్ చేశారని ఎస్పీ స్పష్టం చేశారు.


డీఈఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, చిత్తూరు వన్‌టౌన్‌ పీఎస్‌లో నారాయణపై కేసు నమోదైందని ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతి డీన్ బాలగంగాధర్‌ అరెస్ట్‌, నిందితులందరూ గతంలో నారాయణ సంస్థల ఉద్యోగులు అని చెప్పారు. నిందితుల వాంగ్మూలంతో ఆధారాలు లభ్యం అయ్యాయని, ఉద్దేశపూర్వకంగా పేపర్ లీక్‌ చేశారని, పేపర్ లీక్‌ కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు.



Read more