పదవీ కాలం మరో ఆరు మాసాలు పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-25T02:53:20+05:30 IST

అమరావతి: డీసీఎంఎస్ చైర్మన్ల పదవీ కాలం మరో ఆరు మాసాలు పొడిగించారు. పాత 13 జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ల పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ

పదవీ కాలం మరో ఆరు మాసాలు పొడిగింపు

అమరావతి: డీసీఎంఎస్ చైర్మన్ల పదవీ కాలం మరో ఆరు మాసాలు పొడిగించారు. పాత 13 జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ల పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి అనుమతి ఇచ్చారు. 13 జిల్లాలకు చెందిన చైర్మన్ల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండగా.. మంత్రి ఆమోదంతో వీరి పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగించారు. వచ్చే ఏడాది  జనవరి వరకూ డీసీఎంఎస్ చైర్మన్లుగా ప్రస్తుతం ఉన్నవారే కొనసాగుతారని ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2022-06-25T02:53:20+05:30 IST