పార్‌పెల్లి వద్ద ట్రాక్టర్‌ కింద పడి పదేళ్ల బాలుడి మృతి

May 9 2021 @ 00:46AM
ప్రమాదంలో మృతి చెందిన బానావత్‌ రాజేష్‌, ఇన్‌సెట్‌లో ఫైల్‌ఫొటో

ట్రాక్టర్‌ డ్రైవర్‌, యజమానిపై కేసు నమోదు

లక్ష్మణచాంద, మే 8 : సైకిల్‌పై వెళుతున్న బాలుడిని వెనక నుంచి వస్తున్న  ట్రాక్టర్‌ వేగంగా ఢీకొట్టడంతో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని పార్‌పెల్లిలో శనివారం సాయంత్రం దుర్ఘటన జరిగింది. ఎస్సై వినయ్‌కుమార్‌ మరియు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పార్‌పెల్లి తండాకు చెందిన బానావత్‌ రాజేష్‌(10) అనే బాలుడు పార్‌పెల్లి తండా నుండి పార్‌పెల్లి గ్రామానికి సైకిల్‌పై వెళ్తున్నాడు. అదే దారిలో పుట్టి దినేష్‌ అనే మైనర్‌  ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. పార్‌పెల్లి తండా - పార్‌పెల్లి గ్రామం మధ్య గల రోడ్డుపై వెనుక నుండి ట్రాక్టర్‌ వేగంగా వచ్చి సైకిల్‌పై వెళుతున్న బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ఈ ఘటనను చూసిన వారంతా కన్నీరు మున్నీరయ్యారు. ఢీకొట్టిన ట్రాక్టర్‌కు ఎలాంటి గుర్తింపు నంబర్‌ లేకపోవటం మరో విచిత్రం. ట్రాక్టర్‌ యజమాని కంకళ్ళ చిన్నముత్యం, డ్రైవర్‌ పుట్టి దినేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


Follow Us on: