పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-07T05:53:46+05:30 IST

కొడాలి గ్రామంలోని ఘంటసాల మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు బుధవారం ప్రారంభించారు

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఘంటసాల, జూలై 6 : కొడాలి గ్రామంలోని ఘంటసాల మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు బుధవారం ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే పసుపు కొనుగోళ్లు చేపడుతుందన్నారు. మార్కెఫెడ్‌ డీఎం కె.నాగమల్లిక మాట్లాడుతూ ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల పసుపు సేకరిస్తామని, ఒక క్వింటా పసుపుకు కనీస మద్దతు ధర రూ.6850లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల మురళీకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్‌ వేమూరి వెంకట్రావ్‌, డీసీఎంఎస్‌ బి.ఎం.ప్రసాదరావు, వైస్‌ ఎంపీపీ కుంపటి నాగేంద్రబాబు, కొత్తపల్లి, కొడాలి పీఏసీఎస్‌ చైౖర్మన్లు తాతినేని వెంకట కృష్ణారావు, రామకృష్ణ, సర్పంచ్‌లు వెంకటేశ్వరరావు, రామారావు,  దోనె వెంకటేశ్వరరావు, రమేష్‌  పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-07T05:53:46+05:30 IST