సోలార్‌కు స్వస్తి

ABN , First Publish Date - 2021-10-31T07:02:52+05:30 IST

జిల్లా అభివృద్ధికి దోహదపడతాయని భావించిన సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

సోలార్‌కు స్వస్తి

జిల్లాలో రెండు విద్యుత్‌ ప్రాజెక్టులూ వెనక్కి 

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ కొనుగోలు    తాజా ఒప్పందమే ప్రధాన కారణం

నిధుల లేమి, ముందుకురాని పారిశ్రామిక సంస్థలు 

అసలు సమస్య అదానీ పట్ల ప్రేమే? 

అన్నింటా వెనుకబడిన జిల్లాలో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి దోహదపడతాయ నుకున్న సోలార్‌ పాజెక్టుల నిర్మాణానికి బ్రేక్‌పడింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇక్కడ నిర్మించదలచుకున్న ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయినట్లేనని విద్యుత్‌శాఖ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వకాలంలో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాటిని చేపట్టబోతున్నట్లు అధికారపార్టీ నాయకులు నిన్న మొన్నటివరకు ఘనంగా చెప్పుకున్నారు. అయితే తాజా సమాచారం మేరకు రెండు ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయినట్లే. ఈ ప్రాజెక్టుల భూసేకరణ  కోసం గతేడాదిగా అధికారులు, ఆయా ప్రాంతాల నాయకులు, ప్రజాప్రతినిధులు పడిన శ్రమ కూడా వృథా అయినట్లే. అన్నింటికీ మించి జిల్లాను పట్టిపీడిస్తున్న లోవోల్టేజీ సమస్య నివారణకు లభించే పరిష్కారం కూడా దూరమైనట్లే. సాక్షాత్తూ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తు న్న జిల్లాకు వచ్చిన ప్రాజెక్టులు కూడా ఆగిపోవటం గమనార్హమైతే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థల పట్ల చూపిస్తున్న అతి ప్రేమే కారణ మన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లా అభివృద్ధికి దోహదపడతాయని భావించిన సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరమని ఇప్పటికే విషయం తెలుసుకున్న రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో లోవోల్టేజీ సమస్య భారీగా ఉంది. భూగర్భజలాలు, ఎత్తిపోతల పథకాలపై ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేస్తుండటంతో విద్యుత్‌ వినియోగం జిల్లాలో భారీగా పెరిగింది. ఈనేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగు ణంగా గత టీడీపీ ప్రభుత్వకాలంలోనే జిల్లాలో సోలార్‌ తయారీ ప్రాజెక్టుల ఏర్పాటుకి ప్రణాళిక రూపకల్పన చేశారు. వాటి అమలుకి శ్రీకారం పలికేలోపే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్‌ శాఖామంత్రి కావటం తో సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటులో జిల్లాకు ప్రాధాన్య మిచ్చారు. ఫలితంగా దొనకొండ మండలంలో, సీఎస్‌పురం మండలంలో రెండు సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. రెండోవిడతగా మరో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుని గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలంలో ఏర్పాటు చేయాలని కూడా భావించారు.


 దొనకొండకు తొలి ప్రాధాన్యం

దొనకొండ మండలంలో తొలి ప్రాధాన్యంగా సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది. అక్కడ 800మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్రాజెక్టుని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేతరహాలో సీఎస్‌పురం మండలం లో 500మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం దొనకొండ మండలం రుద్రసము ద్రంతోపాటు సమీప గ్రామాల పరిధిలో భూసేకరణ  కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇటు ప్రభుత్వ పరిధిలోనూ, అటు పట్టాభూమిగా రైతుల వద్ద ఉన్న 2,500 ఎకరాలను సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పలు సమావేశాలు నిర్వహించి రైతులను కూడా ఒప్పించారు. ఆ వెంటనే సీఎస్‌పురం మండలంలో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారం భించేందుకు అధికారులు అవసర మైన చర్యలు చేపట్టారు. ఈ సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక మెగావాట్‌కి సుమారు రూ.5కోట్ల నుంచి రూ.6కోట్ల మేరకు వ్యయమ వుతుంది. తద్వారా దొనకొండ, సీఎస్‌ పురం మండలాల్లో నిర్మించే సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు సుమారు రూ.8వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో స్థానికులకు లభించే ఉద్యోగావకాశాలు తక్కు వైనప్పటికీ అనుబంధ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  ప్రత్యే కించి జిల్లాకు అవసరమైన విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుం డా ఉంది. ఒక అధికారి అంచనా మేరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం లో ఉపయోగించే యంత్ర సామగ్రి 25ఏళ్లు వినియోగంలో ఉంటుంది. తద్వారా రాబోయే 25ఏళ్లలో పైసా పెట్టుబడి లేకుం డా దొనకొండ మండలంలో 800 మెగావాట్ల విద్యుత్‌ని, సీఎస్‌పు రం మండలంలో 500 మెగావాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేసే అవకాశం లభించేది. 

 

పరోక్షంగా అదానీ రాకతో ఆగిన ప్రాజెక్టులు 

తాజాగా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న సమాచా రం మేరకు  సోలార్‌ ప్రాజెక్టులు రెండూ ఆగిపోయినట్లే. అందు కు అధికారులు సరైన కారణం చెప్పలేకపోతున్నారు. మంత్రిగా బాలినేని ఉన్నా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న విధాన నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రాజెక్టులు జిల్లాకు వచ్చే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది. తదనుగుణంగా విద్యుత్‌ శాఖ అధికారులను ఆ విషయాన్ని వదిలేసి మీ పని మీరు చూసుకోండని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా రాష్ర్టానికి విద్యుత్‌ కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేసింది.  కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉండే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ వెనుక ప్రధానమైన పాత్ర అదానీకి చెందిన సంస్థలది. దీంతో అదానీకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌లో ఆ సంస్థ భాగస్వామ్యాన్ని పెంచి తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటం విశేషం. దీంతో అదానీ పాత్ర ఉన్న కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు జరగాలంటే ప్రతిపాదిత సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు తిలోదకాలు ఇవ్వాల్సిం దే. అదేసమయంలో వేరే సంస్థలు ముందుకొస్తే ప్రభుత్వం భాగస్వామిగా సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సుమారు ఏడెనిమిది వేల కోట్లు వెచ్చించి సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను జిల్లాలో నిర్మించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదనేది విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తదనుగుణ ంగా దొనకొండ, సీఎస్‌పురం మండలాల్లో ప్రతిపాదిత సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి బ్రేక్‌ పడినట్లుగానే భావిస్తున్నారు.



Updated Date - 2021-10-31T07:02:52+05:30 IST