ఎత్తైన భవనాల మధ్య ఇరుకైన రోడ్డు
- ఆధ్యాత్మిక కేంద్రంలో ఆకాశహర్మ్యాలు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
- మూడు దశాబ్దాలుగా మారని దుస్థితి
పుట్టపర్తి, మార్చి 27: సత్యసాయి బాబా బోధనలు, ట్రస్టు సేవలతో కుగ్రామమైన పుట్టపర్తికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. భవిష్య త్తులో సుందర పట్టణంగా అభివృద్ధి చేయాలన్న నాటి పాలకుల ఆలో చనతో 1992లోనే పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా) ఏర్పాటు చే శా రు. పుడా అనుమతుల ప్రకారం భవనాలు నిర్మించుకోవాలని నిభందన లు పొందుపరచారు. అప్పట్లో అనుమతులు, పర్యవేక్షణ కోసం, ఓ స్థాయి అధికారిని, సిబ్బందిని నియమించారు. ఒక పక్కన అధికారుల పర్యవేక్షణ లోపం, బిల్డర్లు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మించి అమ్ముకొని సొమ్ముచేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నయి. దీంతో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు గోచరిస్తోంది. భవ నాల్లో గాలి వెలుతురు సైతం అంతగా లేకుండా నిర్మాణాలు జరిగాయి. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే సంఘటన స్థలానికి అగ్నిమాపక యంత్రం చేరుకోలేని దుస్థితి నెలకొంది. మూడు దశాబ్దాలుగా ఇష్టారా జ్యంగా భవనాల నిర్మాణం ఇలా జరుగుతున్నా సంబంధిత అదికారులు చూసీ చూడనట్లు వ్యవహ రిస్తుండటమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు చోద్యం చూడటం తప్ప చర్యలు తీసుకో వడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావలసిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. ఐనప్పటికీ అధికా రులకు చీమకుట్టినట్లు కూడా అనిపించడంలేదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మేజర్ పంచాయతీ 2011లో మున్సిపాలిటీగా రూపాం తరం చెందింది. ఏడుసెంట్ల లోపల ఉన్న స్థలంలో భవనం నిర్మించుకోవాలంటే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. అపైన ఉన్న స్థలంలో పుడా అనుమతి ఉండాలి. అయితే ఆ రెండు శాఖల పర్యవేక్షణ ఉన్నా బిల్దర్లు మాత్రం యఽథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. జీప్లస్టూ కన్నా మించిన భవనాలు నిర్మించేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ఐనా పదంతస్థుల వరకు ఎత్తైన భవనాలు వెలశాయి. మామూలుగా భవనా నికి చుట్టూ ఖాళీస్థలం వదలాల్సి ఉంటుంది. ఏ భవనం చుట్లూ అది అమలు కాలేదు. పార్కింగ్ స్థలం ఉండదు. భవనాలు మాత్రం పేకమే డల్లా వెలిశాయి. దీంతో పాటు ఎలాంటి అనుమతులు లేకున్నా సె ల్లార్లు నిర్మించి వాటిని సైతం అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న బిల్డ ర్లను అధికార గణం ఏమీ చేయలేకపోతోందని పలువురు అంటున్నారు. వెడల్పైన రోడ్లు లేక పోవడంతో ప్రమాదాలు జరిగినపుడు సంఘటన స్థలానికి ఎలాంటి అగ్నిమాపక యంత్రాలు వెళ్ల లేని పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల అటోలు సైతం భ వనాల వద్దకు వెళ్లలేని చిన్న దారులు ఉన్నాయి. అధికారులు బిల్డర్లు కుమ్మక్కవడంతోనే ఇలా జరుగుతోందనే విమర్శలు వినసిస్తున్నాయి.
అనుమతి లేనివాటికి నోటీసులిస్తాం: రాజేష్, టీపీఓ
మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాల యజమానులకు నోటీసులు ఇస్తాం. వారు ఏమేర నిబంధనలు అతిక్రమించారో ఆ వివరాలను, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.