నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు కిందికి ఆటో దూసుకుపోయింది. బస్సు కింది నుంచి ఆటోని క్రేన్ సాయంతో పోలీసులు బయటికి తీస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని వెలికితీశారు. సహాయక చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.