Yasin Malikకు ఉరి శిక్ష విధించండి: NIA

ABN , First Publish Date - 2022-05-25T21:41:34+05:30 IST

ఢిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాలా కోర్టు ఉరిశిక్ష విధించింది.

Yasin Malikకు ఉరి శిక్ష విధించండి: NIA

ఢిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీర్ వేర్పాటువాద నేత Yasin Malikకు పటియాలా కోర్టు కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు ఎదుట మాలిక్ మే పదో తేదీన నేరాన్ని అంగీకరించాడు. మాలిక్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని NIA కోర్టుకు సూచించింది. 


కశ్మీర్‌లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో మాలిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడని, ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో యాసిన్ మాలిక్‌తో పాటు లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్ పేర్లు కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి. 


మరోవైపు Yasin Malikపై కోర్టు తీర్పు నేపథ్యంలో పటియాలా కోర్టు పరిసరాలతో పాటు ఢిల్లీ, కశ్మీర్‌లో భారీగా భద్రతా ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-05-25T21:41:34+05:30 IST