నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్టు

ABN , First Publish Date - 2021-07-06T23:56:21+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్టు అయ్యారు. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకాలపాలకు..

నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్టు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాది అరెస్టు అయ్యారు. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడిన బోధన్ యువకుడిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం అదుపులోకి తీసుకుంది.సౌదీ అరేబియాలో ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చి యువకుడు పరారీ అయ్యాడు. ఈ విషయంపై సౌదీ ప్రభుత్వం ఆరా తీసింది.సదరు యువకుడు నిజామాబాద్ జిల్లా బోధన్ రెంజల్ బేస్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి భారత ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం సమాచారమిచ్చింది.కాగా యువకుడిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం అరెస్టు చేసి తీసుకెళ్లింది. నిజామాబాద్ సీపీ నేతృత్వంలో యువకుడిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-07-06T23:56:21+05:30 IST