శ్రీనగర్-బారాముల్లా హైవేపై encounter...పారిపోయిన ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2021-11-06T12:59:46+05:30 IST

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది...

శ్రీనగర్-బారాముల్లా హైవేపై encounter...పారిపోయిన ఉగ్రవాదులు

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. శ్రీనగర్ పరిధిలోని బెమీనా స్కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర సీఆర్ పీఎఫ్, ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఆసుపత్రిలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు పౌరులను అడ్డు పెట్టుకొని తప్పించుకొని పారిపోయారని శ్రీనగర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఎదురు కాల్పుల వల్ల శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి.


Updated Date - 2021-11-06T12:59:46+05:30 IST