ప్రధాన నిరోధంలో పరీక్ష

ABN , First Publish Date - 2022-07-04T10:37:55+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనా15900 వద్ద మైనర్‌ కరెక్షన్‌లో పడింది.

ప్రధాన నిరోధంలో పరీక్ష

సోమవారం స్థాయిలు

నిరోధం : 15900, 15960

మద్దతు : 15790, 15740


నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనా15900 వద్ద మైనర్‌ కరెక్షన్‌లో పడింది. చివరికి శుక్రవారంనాడు 15500 కన్నా దిగజారి ఆ స్థాయిలో బలమైన రికవరీ సాధించడం సానుకూల ట్రెండ్‌ సంకేతం. చివరికి స్వల్ప లాభంతో 15750 వద్ద వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమన ముగియడం అనిశ్చిత ధోరణిని సూచిస్తోంది. గత కొద్ది రోజులుగా మార్కెట్‌ నిరోధ స్థాయి 16000, మద్దతు స్థాయి 15000 మధ్యన కదలాడుతూ సైడ్‌వేస్‌ ధోరణి ప్రదర్శిస్తోంది. టెక్నికల్‌గా మార్కెట్‌ మైనర్‌ అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ కీలక నిరోధం 16000 కన్నా దిగువనే ఉంది. అమెరికన్‌ మార్కెట్‌లో శుక్రవారం నాటి ధోరణిని బట్టి ఈ వారం సానుకూలంగానే ప్రారంభం కావచ్చు. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం, గత వారం టాప్‌ 15900 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 16000. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ఆ పైన నిరోధ స్థాయిలు 16250, 16550.

బేరిష్‌ స్థాయిలు: 15950 వద్ద విఫలమైతే బలహీనత ముప్పు ఉంటుంది. దిగువన మద్దతు స్థాయిలు 15650, 15500. సానుకూల ధోరణి కోసం 15500 కన్నా పైన నిలదొక్కుకోవడం అవసరం. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ ప్రారంభంలో అప్‌ట్రెండ్‌ సాధించినా 34100 వద్ద నిలదొక్కుకోలేక కరెక్షన్‌ చవి చూసి చివరికి 90 పాయింట్ల నష్టంతో 33540 వద్ద ముగిసింది. మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించినట్టయితే నిరోధ స్థాయి 33800 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన నిరోధ స్థాయి 34100. 

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగువన ఉంది. సానుకూల ట్రెండ్‌ కోసం 16000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి.


 మార్కెట్‌ ప్రస్తుతం స్వల్పకాలిక చలన సగటు స్థాయిలకు చేరువ అవుతోంది. రానున్న కొద్ది రోజుల్లో ఈ స్థాయిల్లో నిలదొక్కుకోవడం తప్పనిసరి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు. 

Updated Date - 2022-07-04T10:37:55+05:30 IST