ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాయాలి

ABN , First Publish Date - 2022-05-20T06:36:32+05:30 IST

23 నుంచి జరిగే పదిపరీక్షలను ఆహ్లాదకర వాతా వరణంలో విద్యార్థులు రాసే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాయాలి
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి 

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ కల్చరల్‌, మే 19 : 23 నుంచి జరిగే పదిపరీక్షలను ఆహ్లాదకర వాతా వరణంలో విద్యార్థులు రాసే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ కారణంగా విద్యార్థులు డిస్టర్బ్‌ అయ్యారని వారికి పరీక్షలంటే భయం తొలగిపోయేలా పరిస్థితులు కల్పించాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా వి ద్యార్థుల తనిఖీలు నీడలో నిర్వహించాలన్నారు. వారు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్‌ కలిపిన నీటిని అందించాలన్నారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల ఇన్‌చార్జి డీఆర్‌వో రాంబాబు మాట్లాడుతూ... కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌ తగినంతగా ఉండాలన్నారు. ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉంచా లన్నారు. మాస్‌కాపీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా విద్యాధికారి రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ... పదిపరీక్షల ఏర్పాట్లపై సవివరంగా వివరించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్ని శాఖలతో సమన్వయంతో పని చేస్తున్న ట్లు వివరించారు. జిల్లాలోని 48 కేంద్రాల్లో 9,719 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది నియామకం తదితర విషయాలు వెల్లడించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఎస్పీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డీవోలు, ఎంఈవోలు హాజరయ్యారు. 

Updated Date - 2022-05-20T06:36:32+05:30 IST