Advertisement

టెస్టులు, వ్యాక్సిన్‌కు.. ఎదురుచూపులు..!

May 3 2021 @ 23:40PM
చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి

  పీహెచ్‌సీల్లో నిండుకున్న టీకా నిల్వలు

  వేధిస్తున్న కిట్ల కొరత 

  ఆందోళనలో ప్రజలు 

 చీపురుపల్లి, మే 3: చీపురుపల్లిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌కి తీవ్ర  కొరత ఏర్పడింది. ఇటు పట్టణంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో గాని, అటు కర్లాం పీహెచ్‌సీలో గాని వ్యాక్సిన్‌ నిల్వలు నిండుకోవడంతో జనం వ్యాక్సిన్‌ కోసం బయట ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.  అయినప్పటికీ వారికి ఊరట లభించడం లేదు. ఓ వైపు కేసులు పెరుగుతున్నా.. స్థానికంగా టీకాలు వేయకపోవడంపై స్థాని కులు పెదవి విరుస్తున్నారు.  కర్లాం పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి దాకా 2400 మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.  1050 మందకి కరోనా పరీక్షలు నిర్వహిం చగా, వారిలో 140 మందికి పాజి టివ్‌గా తేలింది. ఇకపోతే ఇక్కడ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ, ల్యాబ్‌లో శాంపిల్స్‌ లోడు పెరిగిన కారణంగా ప్రస్తుతం టెస్టులను నిలిపి వేశారు. నేడో, రేపో టెస్టులు తిరిగి ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో  రెండు రోజులుగా వ్యాక్సిన్‌ నిలిపివేశారు. కోవీషీల్డ్‌ నిల్వలు లేకపోవడంతో వ్యాక్సినేషన్‌  అర్థాంతరంగా నిలిచిపోయింది.

గంట్యాడలో...

గంట్యాడ:  స్థానిక  ప్రాఽథ మిక ఆరోగ్య కేంద్రంలోనూ కొవిడ్‌ టెస్టులు, వ్యాక్సినేషన్‌ జరగడం లేదు. దీంతో ఇక్కడ వచ్చిన వారం తా నిరాశతో  వెనుదిరిగాల్సి వస్తోంది.  కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత అధికంగా ఉండడంతో  ఆయా పరిఽధిలో  గ్రామస్థులు  టెస్టులు, వ్యాక్సిన్‌ కోసం గంట్యాడ పీహెచ్‌సీ వద్ద కొద్ది రోజులుగా బారులుదీరేవారు.   సోమవారం కూడా వివిధ గ్రామస్థులు అధికంగా వచ్చారు. అయితే  టెస్టులు నిర్వహించడానికి కిట్లు లేకపోవడం, వ్యాక్సిన్‌ రాకపోవడంతో వారం తా నిరాశతో వెనుతిరిగారు. నిత్యం కిటకిటలాడిన ఆసుపత్రి ఖాళీగా కనిపించింది.  

త్వరలో టెస్ట్‌లు నిర్వహిస్తాం.. 

ఇదిలా ఉండగా కర్లాం పీహెచ్‌సీ పరిధిలో రోజుకు కనీసం 20 పాజిటివ్‌ కేసులు బయట పడుతున్నట్టు వైద్యాధికారి డా. సువర్ణ తెలిపారు.  ఈ మేరకు ప్రైమరీ కాంటాక్ట్‌లందరికీ ర్యాపిడ్‌ విధానంలో టెస్టులు చేయాల్సి ఉందన్నారు. అయితే  ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల అది సాధ్యం కావడం లేదన్నారు. త్వరలోనే అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తామన్నారు.


 క్వారంటైన్‌ కేంద్రాలు లేనట్టేనా? 

 గంట్యాడ :  కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఉధృతితో గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.  బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఎక్కడా క్వారంటైన్‌ కేంద్రాలు  ఏర్పాటు చేయలేదు. కొవిడ్‌  లక్షణాలు ఉన్న వారు వద్ద ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే కొందరు గ్రామాల్లో బహిరంగంగా తిరగడంతో మిగిలిన వారు భయపడుతున్నారు. గతంలో కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి క్వారంటైన్‌ ,లేదా ఆసుపత్రిలో ఉండేవారు. ఈ సారి ఆ పరిస్థితి కన్పించకపోవడంతో  కేసులు పెరిగిపోతున్నాయి. గతంలో మదనా పురం ఆదర్శ పాఠశాలలో క్వారంటైన్‌  సెంటర్‌ ఏర్పాటు చేశారు. అక్కడ బాధితులకు భోజనం, వసతి సదుపాయం కల్పించి 14 రోజులు తరువాత రిపోర్డు నెగిటివ్‌ ఇస్తే ఇంటికి తరలించేవారు. ఇప్పుడు లక్ష ణాలు ఉన్నవారంతా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. గ్రామాల్లో   హైపో క్ల్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసి సరిపెడుతున్నారు. చాలా గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టడం లేదు. దీంతో మరింతగా వ్యాధులు ప్రబలు తున్నాయి.  గ్రీన్‌ అంబాసిడర్లు  మాత్రమే ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సంపద కేంద్రంలో వేస్తున్నారు. 

 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.