తేతలిలో వలంటీర్‌, కుటుంబంపై దాడి

ABN , First Publish Date - 2021-03-02T05:34:04+05:30 IST

వలంటీర్‌, అతని కుటుంబంపై దాడి జరిగిన ఘటన తేతలి గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఇటీవల గెలిచిన సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీ సోమవారం నిర్వహించారు.

తేతలిలో వలంటీర్‌, కుటుంబంపై దాడి

  • తణుకు, మార్చి 1 : వలంటీర్‌, అతని కుటుంబంపై దాడి జరిగిన ఘటన తేతలి గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు 
  • తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఇటీవల గెలిచిన సర్పంచ్‌ విజయోత్సవ ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ ర్యాలీని 
  • గ్రామ వలంటీరు అయినం సత్యనారాయణ వీడియో షూట్‌ తీయడాన్ని గమనించిన సర్పంచ్‌ వర్గీయులు అగ్రహించి 
  • దాడికి పాల్పడ్డారు. దాడిలో వలంటీర్‌ తీవ్రంగా గాయపడడంతో పాటు అడ్డువచ్చిన అతని భార్య దుర్గాభవాని, తల్లి ఆదిలక్ష్మిపై 
  • దాడి చేశారు. గాయపడిన వలంటీర్‌ను, కుటుంబ సభ్యులను  వెంటనే తణుకు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 
  • దాడిలో చుక్కా జార్జిలివింగ్‌స్టన్‌తో పాటు మరికొంత మంది దాడికి పాల్పడినట్టు బాధితులు ఫిర్యాదు మేరకు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తణుకు సీఐ  డీఎస్‌ చైతన్యకృష్ణ తెలిపారు 

Updated Date - 2021-03-02T05:34:04+05:30 IST