టెక్సాస్‌లో మిలియన్ మార్క్‌ను దాటిన కరోనా కేసులు !

ABN , First Publish Date - 2020-11-12T14:06:08+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం అక్కడ కొవిడ్-19 ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

టెక్సాస్‌లో మిలియన్ మార్క్‌ను దాటిన కరోనా కేసులు !

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం అక్కడ కొవిడ్-19 ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. తాజాగా టెక్సాస్ రాష్ట్రంలో కరోనా కేసులు మిలియన్ మార్క్‌ను దాటాయి. దీంతో మిలియన్ కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. బుధవారం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,800 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1,010,364కు చేరగా.. మొత్తం మరణాలు 19,300 అయ్యాయని అధికారులు తెలిపారు. టెక్సాస్ తర్వాత కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, ఇల్లినాయిస్, జార్జియా, నార్త్ కరోలినా, టెన్నెస్సీ, విస్కాన్సిన్, న్యూజెర్సీ, ఓహియోలో ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా కోటికి పైగా కేసులు నమోదు కాగా, 2.45 లక్షలకు పైగా మంది కరోనాకు బలయ్యారు.   

Updated Date - 2020-11-12T14:06:08+05:30 IST