తొలి పాప పుట్టిన 3 రోజుల తర్వాత రెండో పాపకు జన్మ

ABN , First Publish Date - 2022-06-09T22:06:17+05:30 IST

టెక్సాస్: సాధారణంగా కవలపిల్లలు కొద్ది నిమిషాల తేడాతో జన్మిస్తుంటారు. మహా అయితే గంటల తేడాతో పుడతారు. కానీ అమెరికాలోని అబిలీన్‌లో కార్మెన్‌ మార్టినెక్స్‌ అనే మహిళకు తొలి పాప పుట్టిన మూడు రోజుల తర్వాత రెండో పాప జన్మించింది.

తొలి పాప పుట్టిన 3 రోజుల తర్వాత రెండో పాపకు జన్మ

టెక్సాస్: సాధారణంగా కవలపిల్లలు కొద్ది నిమిషాల తేడాతో జన్మిస్తుంటారు. మహా అయితే గంటల తేడాతో పుడతారు. కానీ అమెరికాలోని అబిలీన్‌లో కార్మెన్‌ మార్టినెక్స్‌ అనే మహిళకు తొలి పాప పుట్టిన మూడు రోజుల తర్వాత రెండో పాప జన్మించింది. ఇటీవల కార్మెన్‌ మార్టినెక్స్‌ పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డకోసం ప్రయత్నిస్తుండగా.. శిశువు తల్లి గర్భంలోనే ఉండిపోయింది.  దాంతో వైద్యులు ఆమెకు స్కానింగ్‌ చేయగా.. రెండో బిడ్డ తల్లి గర్భంలోనే ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంది. మూడు రోజుల తర్వాత రెండో పాపకు జన్మనిచ్చింది ఆ తల్లి. అయితే పుట్టిన పిల్లలిద్దరూ కాస్తా బరువు తక్కువగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందించారు. వారిద్దరూ పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్‌ చేశారు. ఇలా కవలలు మూడు రోజుల తేడాతో జన్మించడం అత్యంత అరుదైన విషయమని వైద్యులు ప్రకటించారు. ఇక మొదటి పాపకు గాబ్రియేలా గ్రేస్‌ అని, రెండో పాపకు ఇసబెల్లా రోస్‌ అని నామకరణం చేశారు.

Updated Date - 2022-06-09T22:06:17+05:30 IST