Texas shooting: తోటి విద్యార్థి రక్తాన్ని తన దుస్తులకు పూసుకుని.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ 11 ఏళ్ల బాలిక..

ABN , First Publish Date - 2022-05-28T02:27:41+05:30 IST

ఈ దారుణ మారణకాండ నుంచి ఓ బాలిక అత్యంత చాకచక్యంగా తప్పించుకుంది.

Texas shooting: తోటి విద్యార్థి రక్తాన్ని తన దుస్తులకు పూసుకుని..  ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ 11 ఏళ్ల బాలిక..

ఎన్నారై డెస్క్: ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన యావత్ అమెరికా ప్రజానీకాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆటోమెటిక్ తుపాకీతో ఓ ప్రాథమిక పాఠశాలలో కాల్పులకు తెగ బడ్డ నిందితుడు సాల్వడార్ రామోస్.. 19 మంది చిన్నారులను నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకున్నాడు. చివరకు పోలీసులు రామోస్‌ను మట్టుపెట్టినా.. బాధితుల దుఃఖాన్ని మాత్రం ఎవరూ ఉపశమించలేకుండా ఉన్నారు. అయితే.. ఈ దారుణ మారణకాండ నుంచి ఓ బాలిక అత్యంత చాకచక్యంగా తప్పించుకుంది. కాల్పుల్లో గాయపడిన మియా సెరీలియో.. రక్తపుమడుగులో పడి ఉన్న తోటి విద్యార్థి రక్తాన్ని దుస్తులకు పూసుకుంది. తాను మరణించినట్టు నిందితుడిని ఏమార్చ గలిగింది. ఈలోపు పోలీసులు అతడిని మట్టుబెట్టడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన ఈ నరమేధం అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. అమెరికాలో మరోమారు తుపాకీ సంస్కృతిపై చర్చలు మొదలయ్యాయి. 



Updated Date - 2022-05-28T02:27:41+05:30 IST