విద్యార్థులకు పాఠ్యపుస్తకాలేవి..?

Published: Sun, 03 Jul 2022 00:25:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలేవి..? సారంగాపూర్‌ పాఠశాలలో సమస్యలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌, జూలై, 2 : పాఠశాలలు ప్రారంభం అయి నెల రోజులు గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్ర భుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉ న్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల జూనియర్‌ కళాశాలను ఉపాద్యా యులు, నాయకులతో కలిసి పరిశీలించి సమస్యలను అడిగి తెలసుకు న్నారు. ఈ సంధర్బంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు ఇప్పటి వరకు విద్యార్థులకు అం దక పోవడంతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలనే చెప్పడంతో సమయం వృథా అవుతోందన్నారు. మన ఊరు-మనబడి కింద పాఠ శాలల్లో మౌలిక వసతులు, నూతన భవన నిర్మానాలకు నిధులు విడుదల చేసినా ఇప్పటి వరకు 90 శాతం పనుల్లో పురోగతి లేదని అన్నారు. ప్రభుత్వం 2020-21. 2021-22 రెండు సంవత్సరాల కాలంలో శాసన సబ్యులు, శాసన మండలి నిధులు రూ, 600 కోట్లు విద్యారంగానికి కేటాయించిన ఇప్పటి వరకు ఆ నిధులను ఖర్చు చేయక పోవడంతో విద్యారంగంపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుందో దీన్ని బట్టి అర్ధం అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్‌, ఎంపీటీసీ రంగు లక్ష్మణ్‌, సర్పంచ్‌ ఆకుల జమున రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ ధర రమేష్‌, నాయకులు చంధ రాధకిషన్‌, ఉరుమల్ల లక్ష్మారెడ్డి, కాలగిరి, సత్యానారాయణరెడ్డి, కొక్కు గంగారాం పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.