త్వరలోనే మండలాలకు పాఠ్యపుస్తకాలు : డీఈవో

ABN , First Publish Date - 2022-06-26T05:09:30+05:30 IST

జిల్లాలోని అన్ని మండల కేంద్రాకు త్వరలోనే పాఠ్యపుస్త్తకాలు పంపిణీ చేయనున్నట్లు డీఈవో ఉషారాణి తెలిపారు

త్వరలోనే మండలాలకు పాఠ్యపుస్తకాలు : డీఈవో
పుస్తకాలను పరిశీలిస్తున్నడీఈవో ఉషారాణి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 25 : జిల్లాలోని అన్ని మండల కేంద్రాకు త్వరలోనే పాఠ్యపుస్త్తకాలు పంపిణీ చేయనున్నట్లు డీఈవో ఉషారాణి తెలిపారు శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు మొత్తం 5,49,960 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా శనివారం 2,49,850 పుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఇంకా 3,00,110 పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. వీటిని మండల వనరుల కేంద్రానికి పంపించి పాఠశాలలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామకృష్ణారావు, గోదాం ఇన్‌చార్జి తదితరులు ఉన్నారు.

డీఈవో ఉషారాణికి జేడీగా పదోన్నతి 

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ.ఉషారాణికి రాష్ట్ర ప్రభుత్వం జాయింట్‌ డైరెక్టర్‌ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ డీఈవోగా 2019 అక్టోబర్‌ 15న బాధ్యతలు చేపట్టారు. ఈనెల 24న పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జిల్లాకు నూతన విద్యాశాఖ అధికారి ఎవరన్నది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. కొత్తవారిని నియమిస్తారా ? లేక డీఈవో కార్యాలయం ఏడీకి బాధ్యతలు అప్పజెప్పుతారా ? అన్న దానిపై ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. నాగర్‌ కర్నూల్‌ డీఈవోగా విధులు నిర్వహిస్తున్న గోవిందరాజులుకు మహబూబ్‌నగర్‌ డీఈవోగా ఇన్‌చార్జీగా నియమించే అవకాశం ఉందని ఉపాధ్యాయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Updated Date - 2022-06-26T05:09:30+05:30 IST