థాయ్‌ల్యాండ్‌ మహిళ.. భారత్‌లో కొవిడ్‌తో మృతి

ABN , First Publish Date - 2021-05-10T14:08:34+05:30 IST

థాయ్‌ల్యాండ్‌ మహిళ.. భారత్‌లో కొవిడ్‌తో మృతి

థాయ్‌ల్యాండ్‌ మహిళ.. భారత్‌లో కొవిడ్‌తో మృతి

అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేసిన పోలీసులు

లక్నో, మే 9: థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ.. భారత్‌లో మరణించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. 41 ఏళ్ల ఆ మహిళ.. ఏప్రిల్‌ 28న టూరిస్టు వీసాపై ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చేరుకున్నారు. ఇక్కడకు వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆమె కరోనా బారినపడ్డారు. అనంతరం లక్నోలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ మే 3న మరణించారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె అసలు భారత్‌కు ఎందుకు వచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు గైడ్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులు వీక్షించేందుకు వీలుగా అంత్యక్రియలను పోలీసులు ప్రత్యక్షప్రసారం చేశారు. కాగా, ఆమెను భారత్‌ రప్పించింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ కుమారుడని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపిస్తోంది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తోంది. 


Updated Date - 2021-05-10T14:08:34+05:30 IST