థియేటర్‌లోనే ‘తలైవి’ విడుదల

Jun 12 2021 @ 13:17PM

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన ప్రాతధారిగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 23వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్‌చేశారు. కానీ, కరోనా వైరస్‌ దెబ్బకు థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రం విడుదలను నిరవధికంగా వాయిదా వేశారు.  ఈ చిత్రం ఓటీటీ తమిళం రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌లు చిత్ర నిర్మాణం పూర్తికాకముందే కొనుగోలు చేశాయి. ఆ సమయంలో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న ఒప్పందాన్ని స్పష్టంగా కుదుర్చుకుంది. ఫలితంగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. అదేసమయంలో ప్రధాన పాత్రలో నటించిన కంగనా రనౌత్‌ మాత్రం థియేటర్‌లోనే అన్ని భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల అవుతుందని ప్రకటించింది. ఆమె నిర్ణయానికి దర్శక నిర్మాతలు కట్టుబడివున్నారు. ఫలితంగా తలైవి చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకే కాలంలో విడుదల కానుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.