తాళ్లపాలెం-భద్రాచలం జాతీయ రహదారి
ABN , First Publish Date - 2021-04-21T05:26:07+05:30 IST
తాళ్లపాలెం-భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నది.
డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వ ఆదేశం
చింతపల్లిలో పర్యటించిన అధికార బృందం
చింతపల్లి, ఏప్రిల్ 20: తాళ్లపాలెం-భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఎన్హెచ్ఏఐ విశాఖపట్నం ఈఈ జీవీ భాస్కరరావు, మరికొంతమంది అధికారులు మంగళవారం సీలేరు, చింతపల్లి ప్రాంతాలను సందర్శించారు. తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, సీలేరు, చింతూరు, మీదుగా భద్రాచలం వరకు సుమారు 330 కిలోమీటర్ల మేర 80 అడుగుల వెడల్పుతో జాతీయ రహదారిని నిర్మించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి చింతపల్లి, అరకు మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. భూసేకరణ పనులు జరుగుతున్నాయి. భద్రాచలం-తాళ్లపాలెం రహదారి కూడా నిర్మాణం అయితే ఏజెన్సీలో రవాణా సదుపాయం మరింత మెరుగుపడుతుంది.