అంబేద్కర్‌ పేరు కోనసీమకు వద్దని చెప్పగలరా?: తమ్మినేని సీతారాం

ABN , First Publish Date - 2022-05-26T01:23:28+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బాధ్యత లేదా? కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు వద్దని చెప్పగలరా

అంబేద్కర్‌ పేరు కోనసీమకు వద్దని చెప్పగలరా?: తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బాధ్యత లేదా? కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు వద్దని చెప్పగలరా?’’ అని శాసనసభా స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాముల పేర్లను జిల్లాలకు పెట్టినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ రిజర్వేషన్‌ ఫలాలను అంబేడ్కర్‌ సృష్టిస్తే.. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే వద్దనడం సరికాదు. కోనసీమ ఘటనపై విచారణ జరుగుతోంది. ఈ ఘర్షణలో అసలు దోషులు తేలాక.. అప్పుడు అసలు సంగతి ఉంటుంది’’ అని స్పీకర్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-05-26T01:23:28+05:30 IST