ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా చలాన్లు వేయరట!

ABN , First Publish Date - 2021-12-31T00:07:20+05:30 IST

అయితే ట్రాఫిక్ రూల్స్‌ నిర్లక్ష్యం కొంత మందిలో ఉండగా కొంత మందికి వాటిపై సంపూర్ణ అవగాహన లేదని, వాహనదారులు భవిష్యత్‌లో ట్రాఫిక్ రూల్స్ అధిగమించి చలాన్లకు భారీ చెల్లింపులు చేసుకోకుండా ఈరోజు ఎలాంటి చలాన్లు వసూలు చేయకుండా..

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా చలాన్లు వేయరట!

ముంబై: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఇక అంతే సంగతులు. అదే కాకుండా సీసీటీవీ కెమెరాలు, పోలీసుల చేతిల్లో ఉండే కెమెరాలు వాహనదారులు ఎప్పుడు హద్దు మీరతారా అంటూ ఎదురు చూస్తుంటాయి. ఒక్కో వాహనంపై చలాన్ల లిస్ట్ తీస్తే.. సదరు వాహన ఖరీదు కంటే కూడా భారీ మొత్తంలో ఉండే సంఘటనలు అనేకం. అలాంటిది ట్రాఫిక్స్ రూల్స్ పాటించకపోయినా చలాన్లు వేసేది లేదు అంటున్నారు ముంబై సమీపంలోని ఠాణె పోలీసులు. డిసెంబర్ 30వ తేదీని ‘నో ట్రాఫిక్ చలాన్ డే’గా ప్రకటించారు. దీని ప్రకారం ఠాణె పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపిన వారికి చలాన్లు వేయడం లేదట. దీనికి బదులు వారికి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారట. నిజానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టం-2019ని డిసెంబర్ 1 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పాత చట్టంతో పోల్చితే ఈ చట్టం ప్రకారం పెద్ద ఎత్తున ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు భారీ ఎత్తున ఉంది. అయితే ట్రాఫిక్ రూల్స్‌ నిర్లక్ష్యం కొంత మందిలో ఉండగా కొంత మందికి వాటిపై సంపూర్ణ అవగాహన లేదని, వాహనదారులు భవిష్యత్‌లో ట్రాఫిక్ రూల్స్ అధిగమించి చలాన్లకు భారీ చెల్లింపులు చేసుకోకుండా ఈరోజు ఎలాంటి చలాన్లు వసూలు చేయకుండా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఠాణె ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు గురువారం పేర్కొన్నారు.

Updated Date - 2021-12-31T00:07:20+05:30 IST