
పనాజీ: గోవాలో అధికారం చేపట్టడానికి భారతీయ జనతా పార్టీకి మరోసారి అవకాశం కల్పించిన గోవా ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ధన్యవాదాలు తెలియజేశారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ తమ ఐదేళ్ల పాలనలో గోవా ప్రజలు అభివృద్ధి చూశారని, అందుకే బీజేపీని మరోసారి గెలిపించారని అన్నారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల గురించి తెలియజేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, అలాగే బుధవారం బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. ఇక రాష్ట్రంలో మైనింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామని, తమ ప్రాధాన్యత అదేనని అన్నారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలు ప్రభుత్వ కీలకాంశాలని ప్రమోద్ సావంత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి