కాస్త ఆలస్యంగా ‘థ్యాంక్యూ’

Published: Sat, 25 Jun 2022 01:50:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాస్త ఆలస్యంగా థ్యాంక్యూ

అక్కినేని హీరోలకు కలకాలం గుర్తుండిపోయే చిత్రాన్ని ‘మనం’ రూపంలో అందించారు విక్రమ్‌ కె.కుమార్‌. ఆ తరవాత అఖిల్‌కి ‘హలో’ చెప్పారు. ఇప్పుడు నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’ అనిపించబోతున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. రాశీఖన్నా, మాళవికా నాయర్‌ కథానాయికలు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ నిర్మాతలు ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘నాగచైతన్య కెరీర్‌లో ‘ఽథ్యాంక్యూ’ ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోవడం ఖాయం. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయ’’న్నారు. సంగీతం: తమన్‌.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International