'థాంక్యూ' షెడ్యూల్ పూర్తి.. సెల్ఫీ షేర్ చేసిన చైతూ - రాశి ఖన్నా

May 7 2021 @ 17:23PM

అక్కినేని నాగ చైతన్య - రాశి ఖన్నా జంటగా నటిస్తున్న 'థాంక్యూ' సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర బృందం కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.  షూటింగ్ లొకేషన్‌లో నాగ చైతన్య - రాశిఖన్నా కలిసి దిగిన ఓ సెల్ఫీని రాశి అభిమానులకు షేర్ చేసింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిపేస్తున్న సమయంలో 'థాంక్యూ' చిత్ర బృందం చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్ళింది. అయితే కోవిడ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్ని పుకార్లని చిత్ర బృందం తాజాగా షేర్ చేసిన ఫొటోలతో క్లారిటీ వచ్చేసింది. 'థ్యాంక్యూ' ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.