
నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతంబుద్ధనగర్ జిల్లా నోయిడా నగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 33మంది పాఠశాల విద్యార్థులతో సహా 107 మందికి కరోనా సోకింది. 24 గంటల్లోనే 107 కరోనా కేసులు నమోదు కావడంతోపాటు అందులో 33మంది పాఠశాల విద్యార్థులు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.గౌతంబుద్ధనగర్ జిల్లాలో ప్రస్థుతం 411 యాక్టివ్ కరోనా కేసులు వెలుగుచూశాయి.మంగళవారం మరో 32 మంది కరోనా నుంచి బయటపడ్డారు. సోమవారం నోయిడాలో 65 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, వాటిలో 19 మంది పాఠశాల విద్యార్థులున్నారు.
కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో 99,154 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. నోయిడాతోపాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇవి కూడా చదవండి