ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-01-21T02:50:50+05:30 IST

ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడు. తను అనుకున్నది నెరవేర్చుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించాడు...

ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

తన పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండాలని పట్టుబట్టి మరీ ప్రేమికుల రోజునే మూహూర్తం పెట్టించుకున్నాడు. కాబోయే భార్యతో రోజూ మాట్లాడుతూ సంతోషంగా గడుపుతున్నాడు. ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడు. తను అనుకున్నది నెరవేర్చుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు ఓ రోజు టీవీ చూస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత అతడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.


ఢిల్లీ లాహోరీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మహ్మద్ జైద్.. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో నెలకు రూ.8000 జీతంతో పని చేస్తున్నాడు. ఇటీవల ఇతడికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఇరు కుటుంబాలకు నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అయితే తన వివాహం జీవితాంతం గుర్తుండాలని ప్రేమికుల రోజు( ఫిబ్రవరి 14)నే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. పెళ్లికి రోజులు దగ్గరపడుతుండడంతో మహ్మద్ కుటుంబ సభ్యులు.. పెళ్లి పనుల్లో పడ్డారు. మహ్మద్ జేబులో మాత్రం చిల్లి గవ్వ లేదు. దీంతో పెళ్లి సమయంలో ఖర్చుల గురించి ఆలోచించసాగాడు. వివాహం అనంతరం భార్యను బాగా చూసుకోవడానికి ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..


ఈ క్రమంలో ఓ రోజు టీవీలో క్రైమ్ వార్తలు చూసి పక్కా స్కెచ్ వేసుకున్నాడు. నగరంలోని ఓ ఇంటిని టార్గెట్ చేశాడు. ఈ నెల 18వ తేదీన ఆ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించి.. నగలు, నగదు, ఫోన్లను చోరీ చేశాడు. ఇంటికి వచ్చిన యజమానులు చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రూ.2.15లక్షల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు..

Updated Date - 2022-01-21T02:50:50+05:30 IST