ఆ ఐక్యత ఇక్కడ లేదు...

Sep 20 2021 @ 01:51AM

ఎప్పుడూ తెలుగులోనేనా... వేరే భాషలో ఎందుకు చేయలేదని అడగొచ్చు. అవకాశాలు రాక కాదు... వచ్చినా తిరస్కరించాను. దానికి ఒక కారణం ఉంది. వేరే భాషలో సీరియల్‌ షూటింగ్‌ కోసం మన తెలుగు ఆర్టిస్ట్‌ ఒకరు ఆ ప్రాంతానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అక్కడి నటులు కొందరు... ‘వాళ్లు వస్తే మేము షూటింగ్‌ చేయమ’ని పట్టుబట్టారు.


సదరు ఆర్టి్‌స్టని వెనక్కి పంపేశారు. మనం వెళ్లి అక్కడ అవమానపడే కంటే తెలుగు పరిశ్రమ దాటి బయటకు వెళ్లకపోవడమే మేలనుకున్నాను. కానీ మన దగ్గర చూడండి... సీరియల్స్‌లోని హీరోయిన్లలో దాదాపు అందరూ పరభాషా నటులే. ఏం... మన దగ్గర అందమైన అమ్మాయిలు లేరా? ప్రతిభ ఉన్నవాళ్లకు కొదవా? ‘ఇక్కడి వారిని కాదని బయటి వారిని ఎందుకు తెస్తున్నార’ని అడిగితే... ఏవేవో సమాధానాలు వస్తాయి కానీ, అసలు కారణం ఎవరూ చెప్పరు. ఇదంతా మన నటుల్లో ఐక్యత లేకపోవడంవల్లేనన్నది నా అభిప్రాయం.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.