అటు మతోన్మాదం, ఇటు అరాచకం!

ABN , First Publish Date - 2022-09-20T06:24:57+05:30 IST

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంటే, ఇంకొకరు అరాచక పాలన కొనసాగిస్తున్నారు...

అటు మతోన్మాదం, ఇటు అరాచకం!

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంటే, ఇంకొకరు అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పేద ప్రజల సంక్షేమం కోసం బ్యాంకులను జాతీయం చేస్తే, ఈరోజు మోదీ వాటిని ప్రైవేటుపరం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని, రైల్వేను, టెలికామ్‌ను, బ్యాంకులను, ఎల్ఐసిని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి, లేదా ప్రైవేటీకరించడానికి యత్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఖాళీస్థలాలను, ఎమ్మార్వో కార్యాలయాలను అమ్మాలని చూస్తుంది. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు, జైళ్లకు పంపుతున్నారు. ఐఏఎస్‌లు కోర్టుల్లో చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా మేధావులు మాట్లాడకపోతే ప్రమాదం. ఈ అరాచక పాలనకు, మతోన్మాదానికి చరమగీతం పాడకుంటే భవిష్యత్‌ తరాలు తిట్టుకుంటాయి.

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2022-09-20T06:24:57+05:30 IST