అద్దంకిలో 8వ వార్డు ఉపఎన్నికకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-10-27T05:17:08+05:30 IST

అద్దంకి నగర పంచాయతీలోని 8వ వార్డు ఉపఎన్నికకు యంత్రాంగం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ఏర్పాట్ల పై దృష్టి సారించింది. ఎన్నికల అధికారి, నగర పంచాయతీ కమిషనర్‌ ఫజులుల్లా మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

అద్దంకిలో 8వ వార్డు ఉపఎన్నికకు సన్నద్ధం



అద్దంకిటౌన్‌, అక్టోబరు 26 : అద్దంకి నగర పంచాయతీలోని 8వ వార్డు ఉపఎన్నికకు యంత్రాంగం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ఏర్పాట్ల పై దృష్టి సారించింది. ఎన్నికల అధికారి, నగర పంచాయతీ కమిషనర్‌ ఫజులుల్లా మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డుకు సంబంధించి ఎవ్వరూ పోటీలో లేకపోవడంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయిందన్నారు. ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. నోటిఫికేషన్‌ ప్రకటించిన వెంటనే ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఏఈ మధు సూదన్‌, ఉద్యానశాఖాధికారి ఆదిరెడ్డి, ఎన్‌ఎస్పీ ఏఈ వేణు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:17:08+05:30 IST