4 అంతస్థుల భవనం.. యజమానికి తెలియకుండానే ఏడాదిలోనే 20 సార్లు అమ్మేశారు.. ఇంత మోసం ఎలా జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-09-14T22:34:53+05:30 IST

రియల్ ఎస్టేట్ రంగంలో (Real estate sector) జరిగే మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్థలాల విలువ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో..

4 అంతస్థుల భవనం.. యజమానికి తెలియకుండానే ఏడాదిలోనే 20 సార్లు అమ్మేశారు.. ఇంత మోసం ఎలా జరిగిందంటే..

రియల్ ఎస్టేట్ రంగంలో (Real estate sector) జరిగే మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్థలాల విలువ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. లేని యజమానులను ఉన్నట్లు చూపించి, కోట్ల రూపాయల స్థలాలు, ఇళ్లను విక్రయించడం సర్వసాధారణమైంది. పూణేలో ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. నాలుగు అంతస్థుల భవనాన్ని యజమానికి తెలీకుండానే ఏడాదిలో సుమారు 20సార్లు అమ్మేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


పూణెలోని (Pune) కోంధ్వా ప్రాంతంలో.. కిరణ్ చద్దా, సుమన్ ఖండ్‌గాలే, నీరూ గుప్తా, అంజలి గుప్తా అనే నలుగురు మహిళలు కలిసి 1994లో స్థలాన్ని కొనుగోలు చేశారు. అనంతరం 2005లో ఆ స్థలంలో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి 'నందనవన్' అని పేరు పెట్టారు. అయితే 2021లో ఈ భవనాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కొందరు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లను సంప్రదించి, తమ ఆస్తికి సంబంధించిన పత్రాలను అందించారు. దీంతో అసలు మోసం ఒక్కడి నుంచే మొదలైంది. యజమానుల ఆధార్ కార్డుల్లోని ఫొటోల స్థానంలో వేరే ఫొటోలను మార్చారు. తద్వారా అసలు మోసానికి తెరలేపారు. గత ఏడాది జులై 1న ఆస్తిలోని మొదటి అంతస్తును మొదటి సారిగా విక్రయించారు. అప్పటినుంచి విక్రయాల పరంపర కొనసాగింది.

అవును.. 9 రోజుల క్రితం పుట్టిన కూతుర్ని ఎవరికీ తెలీకుండా నేనే చంపానంటూ ఆ తండ్రి చెప్పిన కారణం విని అంతా షాక్..!


ఈ బిల్డింగ్‌లోని ఒక్కో అంతస్తును కొన్న వారు.. వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి సుమారు రూ. 2.35 కోట్లు రుణం (Bank loan) తీసుకున్నారు. గోర్డే అనే వ్యక్తి ఫిబ్రవరి 24న రూ.96లక్షలతో భవనంలోని మొదటి అంతస్తును కొనుగోలు చేసి, రూ.69.87 లక్షలకు కాస్మోస్ బ్యాంకులో తనఖా పెట్టాడు. అలాగే మరో అంతస్తును రూ.1.2 కోట్లతో కొనుగోలు చేసి.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.96 లక్షల రుణం తీసుకున్నాడు. అదేవిధంగా అనిల్ అగర్వాల్, సునీత అనిల్ అగర్వాల్ అనే దంపతులు.. రూ.96 లక్షలకు మూడో అంతస్తులను కొనుగోలు చేసి, కాస్మోస్ బ్యాంకులో రూ.70 లక్షల రుణం తీసుకున్నారు. ఇలా ఏడాదిలో సుమారు 20సార్లు ఈ భవనంపై క్రయవిక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 4న ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిది. ఈ విక్రయాలన్నీ 2021 జూలై నుంచి 2022 జూలై మధ్య జరిగినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మాత్రలు వాడుతున్నా ఎంతకూ తగ్గని జ్వరం.. ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆ తల్లి అడిగితే కొడుకు చేసిన దారుణమిదీ..!



Updated Date - 2022-09-14T22:34:53+05:30 IST