న్యాయవాద రక్షణ చట్టం తేవాలి

ABN , First Publish Date - 2021-03-02T05:50:33+05:30 IST

న్యాయవాదులపై దాడులు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

న్యాయవాద రక్షణ చట్టం తేవాలి
సంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట నిరసన దీక్షలో న్యాయవాదులు

సంగారెడ్డి క్రైం, మార్చి 1 : న్యాయవాదులపై దాడులు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. న్యాయవాదులపై దాడులకు నిరసనగా సంగారెడ్డి కోర్టు ఎదుట సోమవారం నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే 9న చలో హైదరాబాద్‌ చేపడుతున్నామన్నారు. హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య అత్యంత దారుణమని పేర్కొన్నారు. న్యాయవాదుల హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కేసులో సత్వర న్యాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు బి.రామారావు దేశ్‌పాండే, నాగిశెట్టి, కిషన్‌రావు, డి.అశోక్‌, రాజశేఖర్‌రెడ్డి, జ్ఞానేభా,ఆర్‌.శ్రీనివస్‌, మల్లేశం పాల్గొన్నారు. 

జహీరాబాద్‌ : ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ కల్పించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్‌ పిలుపు మేరకు సోమవారం జహీరాబాద్‌ పట్టణంలో కోర్టు ఎదుట న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు శ్రీనివా్‌సఖన్నా, నతానియేల్‌, గోపాల్‌, ముక్తార్‌అహ్మద్‌, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:50:33+05:30 IST