రైతులకు వ్యవసాయ సలహామండలి అండగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-22T05:04:57+05:30 IST

జిల్లాలోని రైతులకు వ్యవసాయ సలహామండలి వెన్నుద న్నుగా ఉండాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావే శపు హాలులో శుక్రవారం జిల్లాస్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం చైర్మన్‌ ఆళ్ల రవీంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది.

రైతులకు వ్యవసాయ సలహామండలి అండగా ఉండాలి
మాట్లాడుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఎంపీ మాగుంట


ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 21 : జిల్లాలోని రైతులకు వ్యవసాయ సలహామండలి వెన్నుద న్నుగా ఉండాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావే శపు హాలులో శుక్రవారం జిల్లాస్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం చైర్మన్‌ ఆళ్ల రవీంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ జిల్లాస్థాయిలోనే కాకుం డా నియోజకవర్గ స్థాయిలోనూ వ్యవసాయ స లహామండళ్లు రైతులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలన్నారు. కందుకూరు ఎ మ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రమాదం లేదా వ్యాధులతో ఒకేసారి మూడు ప శువులు చనిపోతే నష్ట పరిహారం మంజూరు చే యాలన్న నిబంధనను సడలించి ఒక పశువు చని పోయినా బాధిత రైతును ఆదుకునేలా చూడాల న్నారు.  జేసీ వెంకటమురళి మాట్లాడుతూ జీరో బెస్ట్‌ నేచురల్‌ఫార్మింగ్‌(జడ్‌బీఎస్‌ఎఫ్‌) విధానం లో  పంటలు సాగు చేయడం వల్ల కలిగే ప్రయో జనాలను లబ్ధిదారులే ఇతర రైతులకు తెలియజే సేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైర్మన్‌ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కొత్తపట్నం మండ లంలో 20మంది జడ్‌బీఎస్‌ఎఫ్‌ విధానంలో పం టలు సాగు చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి మండలంలో ఈ తరహా సాగును ప్రోత్సహించా లని చెప్పారు. అనంతరం బ్రూసెల్లోసిస్‌ వ్యాధి టీ కాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కర పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, బేబిరాణి, చం ద్రశేఖర్‌రెడ్డి, నారదముని, యుగంధర్‌ తదితరు లు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T05:04:57+05:30 IST