బీజేపీని ఓడించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-14T05:42:34+05:30 IST

మతతత్వ బీజేపీని మునుగోడులో ఓడించడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చౌటుప్పల్‌ మండల కేం ద్రంలో శనివారం నిర్వహించిన సీపీఎం మునుగోడు నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

చౌటుప్పల్‌ రూరల్‌, అగస్టు 13: మతతత్వ బీజేపీని మునుగోడులో ఓడించడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చౌటుప్పల్‌ మండల కేం ద్రంలో శనివారం నిర్వహించిన సీపీఎం మునుగోడు నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో మతోన్మా దం, అరాచకం, అవినీతి పెరిగిందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక విషయంపై సీపీఐతో ఇప్పటికే చర్చించామని, రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసమే రాజీనామా చేశారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణలో బీజేపీకి ఆదరణ లేదని, మునుగోడు ఉప ఎన్నికను అవకాశంగా తీసుకొని బలపడేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి గతంలో సీపీఎం కార్యకర్తల ఇళ్ల పై, కార్యకర్తలపై దాడులు చేయించాడని, ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెబుతామన్నారు. బీజేపీ పాలనతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలుచేస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నేత చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జహంగీర్‌, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీశైలం, అనురాధ, సైదులు, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:42:34+05:30 IST