జాబితాను విడుదల చేస్తున్న పరిటాల శ్రీరామ్
తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇనచార్జి పరిటాల శ్రీరామ్
అనంతపురం రూరల్, జూన 27 : రైతు, ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు మరో సారి చంద్రబాబును సీఎంగా చేయడమే లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇనచార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి పరిటాల సునీత నివాసంలో ధర్మవరం నియోజకవర్గం తెలుగు రైతు కమిటీ జాబితాను ఆయన విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఎర్రాయపల్లి చల్లా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా నేలకోట భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సంకేపల్లి సుధాకర్, కోడేకండ్ల ఉమాపతి నాయుడు, ఓబుళనాయునిపల్లి కాశప్ప, అధికార ప్రతినిధులుగా ఎం చెర్లోపల్లి చిట్రా నాగభూషణం, చిన్పూరు బత్తలపల్లి చింతా మధుసూదన, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీచెర్లోపల్లి శేఖర్, ఒలిమి చెర్లోపల్లి నీరుగట్టు పోతలయ్య, ఏకపాదంపల్లి తిరుమల నాయుడు, ముదిగ్గుబ్బ తుమ్మల రమణప్ప, కునుకుంట్ల దామోదర్‌రెడ్డి, కార్యదర్శులుగా జొన్నల కొత్తపల్లి జానీ, రాఘవంపల్లి మందల శ్రీనివాసులు, నారసింపల్లి వెంకటన్న, గరుడుంపల్లి ముసుగు చంద్రశేఖర్, నాయనిపల్లి గంగాధర్, సోషల్ మీడియా ప్రతినిధిగా ఎర్రయపల్లి నారిశెట్టి రామనాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సభ్యులకు పరిటాల శ్రీరామ్ అభినందించారు ఈకార్యక్రమంలో ధర్మవరం కన్వీనర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.