అద్దంకిలోని 20వ వార్డులో సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న బాచిన కృష్ణచైతన్య
శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య
అద్దంకి, జూన్ 24: అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని శాప్‌నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 20వ వార్డులో కృష్ణచైతన్య ఇంటిం టికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు, అందుతున్న లబ్ధి గురించి లబ్దిదారులకు వివరించారు.
26న జరిగే ప్లీనరీని విజయవంతం చేయాలి
వైసీపీ అద్దంకి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ ఈనెల 26వ తేది ఉదయం 9 గంటలకు పట్టణంలోని శింగరకొండ రోడ్డు లో కూకట్ల కన్వన్షెన్‌లో జరుగుతుందని కృష్ణచైతన్య తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లీనరీకి రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, పరిశీలకులు ముఖ్య అతిథు లుగా హజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతి నిధులు, వైసీపీ నాయకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాలలో చైర్‌పర్సన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ దేసు పద్మేష్, 20వ వార్డు కౌన్సిలర్ గుంజి కోటేశ్వరరావు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్, జ్యోతి హనుమంతరావు, చిన్ని శ్రీమన్నారాయణ, గూడా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.