సేవా గుణాన్ని పెంపొందించడమే ఎన్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-25T05:07:04+05:30 IST

విద్యార్థులు సేవాగుణం అలవర్చుకోవాలని డీఎస్పీ ఆనంద్‌ రెడ్డి అన్నారు.

సేవా గుణాన్ని పెంపొందించడమే ఎన్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం
ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతున్న డీఎస్పీ ఆనంద్‌రెడ్డి

వనపర్తి రూరల్‌, సెప్టెంబరు 24:  విద్యార్థులు సేవాగుణం అలవర్చుకోవాలని డీఎస్పీ ఆనంద్‌ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని ప్రభు త్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్‌ ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలకు ఆయ న  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామా జిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా చేసి దేశభక్తిని, సేవా గుణాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ఎన్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటైందన్నారు. విద్యా ర్థుల కర్తవ్యాలను గుర్తు చేస్తూ విద్యను అభ్యసిం చడమే కాకుండా సామాజిక సేవ ద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యం అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, జాతీయ సమైక్య త, లౌకిక, సామ్యవాద భావాలు, ప్రతీ ఒక్కరిలో పెంపొందింపజేయాలని అన్నారు. సమాజంపై అవగాహన ఏర్పరచుకోవడం, సమస్యలకు పరి ష్కార మార్గాలు  వెతకడం, వాటి నివారణకు కృషి చేయడం పౌరుని బాధ్యతలు పెంపొందించ డంలోను ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కృషి చేయాల న్నారు.  ఎన్‌ఎస్‌ఎస్‌ యొక్క లక్ష్యం, ఆవశ్యకత విద్యార్థుల యొక్క పాత్రపై వివరించారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ యాదగిరి గౌడ్‌, దామ్‌సింగ్‌, కుర్మయ్య, రఘు నందన్‌ అధ్యాపక, అధ్యాపకేతర బృందం, వాలం టీర్స్‌ తదితరులు పాల్గొన్నారు. 

పాన్‌గల్‌లో...

పాన్‌గల్‌ :  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవాన్ని  జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కళాశాల ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ ప్రకాశం శెట్టి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ సుదర్శన్‌ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే సేవాగుణం అలవర్చుకొవాలన్నారు.  కా ర్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:07:04+05:30 IST