ప్రభుత్వ విధానాలను ఎండగట్టమే ప్రజాపోరు లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-03T05:02:53+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక హామీలు గాలికి వదిలేసి ప్రజలపై పన్నుల వర్షం కురి పిస్తోందని, ప్రభుత్వ విధి విధానాలను ఎండగట్టడమే ప్రజాపోరు ముఖ్య లక్ష్యమని ఓబీసీ జాతీయ కార్యదర్శి పార్థసారధి అన్నారు.

ప్రభుత్వ విధానాలను ఎండగట్టమే ప్రజాపోరు లక్ష్యం
సమావేశంలో మట్లాడుతున్న పార్థసారధి

- ఓబీసీ కార్యదర్శి పార్థసారధి

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబరు2: వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక హామీలు గాలికి వదిలేసి ప్రజలపై పన్నుల వర్షం కురి పిస్తోందని, ప్రభుత్వ విధి విధానాలను ఎండగట్టడమే ప్రజాపోరు ముఖ్య లక్ష్యమని ఓబీసీ జాతీయ కార్యదర్శి పార్థసారధి అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజాపోరు పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ఆదే శాలపై పట్టణ అధ్యక్షుడు నిర్మల్‌కుమార్‌ ఆధ్వర్యంలో నియోజక వర్గ వ్యాప్తంగా వీధి సభలు నిర్వహించారు. ప్రజాపోరు చివరి రోజులో భాగంగా ఆదివారం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్ప త్రి వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా మొదట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ను స్మరించుకున్న అనంతరం వీధి సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో ప్రస్తుత వైసీపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రజాపోరు (వీధి సభల) ముఖ్య ఉద్దేశ్యమన్నా రు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి చేసిన హామీలు అన్ని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నడూ కనీ వినని విధంగా ఇంటి పన్ను, స్థలాల పై పన్ను, ఆఖరికి చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా నామకరణం చేసి చెలామని చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి అరాచకాలు జరిగాయని ఆరోపించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే జగన్‌ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడన్నారు. ఈ సభకు ముఖ్య అతిధు లుగా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పొలిటికల్‌ సలహా కమిటీ సభ్యులు సాయిలోకేశ్‌, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శులు పులి నరేంద్రకుమార్‌రెడ్డి, చీర్ల శ్రీనివా స్‌యాదవ్‌, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు బీరంగి రేవతి, సీనియర్‌ నేతలు శివగంగిరెడ్డి, బీజేపీ మండల స్థాయి జాతీయ స్థాయి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:02:53+05:30 IST