పేదల కడుపు నింపడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-27T06:32:41+05:30 IST

రాష్ట్రంలోని ప్రతీ పేదవాడి కడుపు నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పట్టించుకోని ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

పేదల కడుపు నింపడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 


సూర్యాపేట టౌన్‌, జూలై 26 : రాష్ట్రంలోని ప్రతీ పేదవాడి కడుపు నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పట్టించుకోని ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఓట్ల రాజకీయ కోసమే ప్రతీ పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు ఎప్పుడో విస్మరించారన్నారు. దేశంలో మరో ఆదర్శ పథకంగా దళితబంధు పథకం నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని దేశమంతా గర్విస్తుండగా ప్రజలంతా ప్రభుత్వాన్ని సొంతం చేసుకుంటున్నారన్నారు. ప్రతీ కుటుంబం సీఎం కేసీఆర్‌ను తమ కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తున్నారన్నారు. 2014కు ముందు ఇవే ఆహార భద్రత పథకాన్ని గత పాలకులు చేపట్టినా లోటుపాట్లు ఉండేవని ప్రస్తుతం అవి దరిదాపుల్లో సైతం లేవన్నారు. ప్రతిపక్షాల విమర్శలను అంతే హుందాగా ప్రజలంతా తిప్పికొట్టాలని సూచించారు. మిషన్‌ భగీరథతో సురక్షితమైన మంచినీటిని ఇంటింటికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎ్‌సవో విజయలక్ష్మి, డీఎం రాపంతినాయక్‌, తహసీల్దార్‌ వెంకన్న, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


విపక్షాలవి దివాలకోరు రాజకీయాలు

సూర్యాపేట (కలెక్టరేట్‌) : రాష్ట్రంలో విపక్షాలు దివాలకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి జగదీ్‌షరెడ్డి విమర్శించారు. ఆయన జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్థంలేని విమర్శలు, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటైందని ఎద్దేవా చేశారు. 2014నుంచి 2018వరకు ప్రతిపక్షాలు ఈ తరహాలోనే ప్రవర్తించి ప్రజల్లో అభాసుపాలయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అంటూ ఏదీ లేదన్నారు. ఉన్న పార్టీలు కేవలం ఆంధ్రా పార్టీల నాయకుల దగ్గర బానిసలుగా బతుకుతున్నాయన్నారు. ప్రతీవిషయాన్ని రాజకీయంచేసి రాద్ధాంతం చేయాలన్నదే ప్రతిపక్షాల తలంపుగా కనిపిస్తోందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత బంధు పథకం అమలు చేసి తీరుతామని ఽధీమా వ్యక్తం చేశారు.


Updated Date - 2021-07-27T06:32:41+05:30 IST