రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

Jul 30 2021 @ 00:15AM
రైతువేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీచైర్‌పర్సన్‌

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌

జగిత్యాల రూరల్‌, జూలై 29 : రైతును రాజు చేయడ మే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని చల్‌గల్‌ క్లస్టర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన రైతువేదిక భవనాన్ని ఎమ్మెల్యే, జడ్పీచైర్‌ పర్సన్‌లు గురువారం ప్రారంభించారు. అనంతరం రేషన్‌ కార్డులను అబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను కేసీఆర్‌ కంటికి రెప్పలా గా కాపాడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా కోటి 45 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. అ నంతరం దావ వసంతసురేష్‌ మాట్లాడుతూ రైతు వే దిక ఆలోచన గొప్ప రావడం గర్వ కారణమని నిత్యం సీఎం కే సీఆర్‌ ప్రజల సంక్షేమం, రైతులు సంక్షేమం గురించి ఆ లోచిస్తారని పేర్కొన్నారు. ప్రతి పక్షాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయన్నారు. దళిత బంధు, రైతు బంధుపథకాలు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. అనంత రం లబ్దిదారులకు సీఎంఆర్‌ఎప్‌ చెక్కులు, రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామో దర్‌రావు, డీఏఓ సురేష్‌ కుమార్‌, ఇన్‌ఛార్జీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ గం గనర్సు రాజన్న, మండల రైతు బంధు కన్వీనర్‌ రవీం దర్‌రెడ్డి, అంతర్గాం సర్పంచ్‌ నారాయణ, పీఏసీఎస్‌ చైర్మ న్లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, తహసీల్దార్‌ దిలీప్‌నా యక్‌ పాల్గొన్నారు.


Follow Us on: