అగ్రరాజ్యంలో తెలుగు యువకుడి అద్భుత ప్రతిభ

ABN , First Publish Date - 2021-07-20T21:24:35+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు యువకుడు సత్తా చాటాడు. దీంతో భారతీయుల ప్రతిభ అమెరికాలో మరోసారి మార్మోగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సీలేరుకు చెందిన భరద్వాజ్.. ఉన్నత చదువుల కోసం 2014లో అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో అమెరికాలోని యూఎంకేసీలో పీహెచ్‌డీ..

అగ్రరాజ్యంలో తెలుగు యువకుడి అద్భుత ప్రతిభ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు యువకుడు సత్తా చాటాడు. దీంతో భారతీయుల ప్రతిభ అమెరికాలో మరోసారి మార్మోగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సీలేరుకు చెందిన భరద్వాజ్.. ఉన్నత చదువుల కోసం 2014లో అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో అమెరికాలోని యూఎంకేసీలో పీహెచ్‌డీ చేస్తూన్నారు. ఇందులో భాగంగానే ఏడేళ్లపాటు విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి పరిశోధనలు జరిపారు. ఖగోళ శాస్త్రంలో భరద్వాజ్ జరిపిన అపూర్వ పరిశోధనను సదరు యూనివర్సిటీ గుర్తించింది. దీంతో భరద్వాజ్‌కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఖగోళ భౌతిక శాస్త్రంలో యూఎంకేసీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా భరద్వాజ్‌ నిలిచారు. 



కాగా.. భరద్వాజ్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లో పూర్తైంది. విజయవాడలోని ఓ కాలేజీలో ఆయన బీటెక్ పూర్తి చేశారు. భరధ్వాజ్ తండ్రి ఏపీ జెన్‌కోలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పరిశోధనా సమయంలో దాదాపు ఎనిమిది సంస్ధలు ఉపకార వేతనాలతో భరద్వాజకు తోడ్పాటునందించాయి. భరద్వాజ్ పరిశోధనల ప్రతిభను గుర్తింపుగా అస్ట్రోనామికల్ సొసైటీ గోల్డ్ మెడల్ అందించింది. ప్రస్తుతం భరద్వాజ్ అక్కడే పోస్టు డాక్టరేట్ చేయనున్నట్టు తెలుస్తోంది. భరద్వాజ్‌కు లభించిన గుర్తింపు పట్ల అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-07-20T21:24:35+05:30 IST