రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-09-22T07:18:17+05:30 IST

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రైతు వ్యతిరేక బిల్లు అని పలువురు రైతు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆ బిల్లును వెంటనే

రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలి

మేళ్లచెర్వు/ నాగారం/ హుజూర్‌నగర్‌/ఆత్మకూర్‌(ఎస్‌),సెప్టెంబరు 21: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రైతు వ్యతిరేక బిల్లు అని పలువురు రైతు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మేళ్లచె ర్వులో రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వట్టెపు సైదు లు, నాయకులు కె.వెంకన్న, గురవయ్య, దుర్గయ్య, నర్సింహారావు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ పాల్గొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చి రైతులకు అన్యాయం చేస్తోందని ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్‌, డివిజన్‌ అధ్యక్షుడు సంపెట కాశయ్య అన్నారు. నాగారంలో విలేకరులతో మాట్లాడారు.


అనంతరం డీకొత్తపల్లి గ్రామంలో బిల్లుప్రతులను వారు కాల్చి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సతీష్‌, గణేష్‌, విక్రమ్‌, లింగయ్య, కొమరయ్య, బడేమియ పాల్గొన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుతో రైతాంగం ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ దొంగరి వెంకటేశ్వర్లు విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో తుమ్మలపెన్‌పహాడ్‌లో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, నాయకులు నల్లగొండ నాగయ్య, చంద్రయ్య, పిట్టల లింగయ్య, నర్సమ్మ, వెంకన్న, సత్తిరెడ్డి, వీరయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T07:18:17+05:30 IST