రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-22T03:38:01+05:30 IST

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు కోటం రాజు, కిల్లెగోపాల్‌లు డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
జీపు జాతాలో భాగంగా మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కోటంరాజు

జడ్చర్ల, జనవరి 21: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు కోటం రాజు, కిల్లెగోపాల్‌లు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన జీపు జాతా గురువారం జడ్చర్లలోని నేతాజీ చౌరస్తాకు చేరకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతులకు నష్టం వాటిల్లేలా ఉన్న మూడు చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను ఆగం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఖమర్‌అలీ, కురుమూర్తి, జగన్‌, నాగరాజు, సాయిలు, రమేశ్‌, జంగయ్య పాల్గొన్నారు. 


వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

అడ్డాకుల: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతుల సమస్యలు పరిష్కరిం చాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు కోరారు. గురువారం ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరు యాత్ర అడ్డాకులకు చేరుకున్న సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T03:38:01+05:30 IST